Monday, December 23, 2024

ప్రచారానికి నిధుల్లేవ్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీసిన మోడీ

మా బ్యాంకు ఖాతాల స్తంభన క్రిమినల్ చర్య

ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం : రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశం లభించేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీకి తన బ్యాంకు ఖాతాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆమె డిమాండు చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మరో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న విలేకరుల సమావేశంలో మ బ్యాంకు ఖాతాలన్నిటినీ స్తంభింపచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల ప్రచారాన్ని చేపట్టలేపోతున్నాము. ఎన్నికల్లో పోటీ చేసే మా సామర్ధాన్ని దెబ్బతీశారు అని రాహుల్ తెలిపారు. పత్రికలకు ప్రకటనలు ఇవ్వలేకపోతున్నామన్నారు. విమాన ప్రయా ణాల సంగతేమోగానీ కనీసం రైలు టికెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఆదాయం పన్ను రిటర్న్ వివాదం కారణంగా తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలన్నిటినీ స్తంభింపచేశారని ఆయన తెలిపారు. ఎన్నికలలో అన్ని పార్టీలకు సమా న అవకాశాలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ వెంటనే తమ బ్యాంకు ఖాతాలను తిరిగి తమకు అందుబాటులోకి తే వాలని ఖర్గే కోరారు. ఇది కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపచేయడం మా త్రమే కాదని, ఇది భారతీయ ప్రజాస్వామ్యాన్ని స్తంభింప చేయడమేని రాహుల్ గాంధీ అభివర్ణించారు. భారత్‌లో నేడు ప్రజాస్వామ్యం లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని భాగత్‌ను చెప్పుకోవడం పూర్తి అసత్యం. మా బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీసుకున్న క్రిమినల్ చర్య. ఇది ప్రధాని, హోం మంత్రి పాల్పడిన క్రిమినల్ చర్య అంటూ రాహుల్ మండిపడ్డారు. తమకు దేశంలో 20శాతం ఓటర్ల మద్దతు ఉందని, అలాంటి పరిస్థితుల్లో రెండు రూపాయలు కూడా చెల్లించలేకపోతున్నామన్నారు. ప్రజాస్వామిక సూత్రాలను కాపాడాల్సిన వ్యవస్థలున్నాయని, కాని ఏమీ జరగడం లేదని రాహుల్ అన్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని రాహుల్ పేర్కొన్నారు.
పథకం ప్రకారమే మోడీ  కుట్ర : సోనియా
కాంగ్రెస్ ఖాతాల నుంచి డబ్బును బలవంతంగా తరలించుకుపోతున్నారని సోనియా గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా చావుదెబ్బ కొట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఒక పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక పక్క ఎన్నికల బాండ్ల వివాదం, మరో పక్క ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారని ఆమె చెప్పారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులలోను తాము తమ ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామని సోనిగా గాంధీ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దీని ప్రభావం కాంగ్రెస్‌పైనే కాక భారతదేశ ప్రజాస్వామ్యంపైన పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఖాతాలు అన్‌ఫ్రీజ్ చేయండి : ఖర్గే
స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని కోరుకుంటే తమ పార్టీ బ్యాంకు ఖాతాలను తమకు అందుబాటులోకి తెచ్చి ఎన్నికలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఖర్గే పిలుపునిచ్చారు. ఎన్నికల బాండ్ల ద్వారా వేలాది కోట్ల రూపాయలను సమకూర్చుకున్న అధికార బిజెపి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసి ఎన్నికలలో తమకు అవాంతరాలను కల్పిస్తోందని ఖర్గే ఆరోపించారు. అధికారంలో ఉన్న వారికి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని రాజ్యాంగ సంస్థలపై నియంత్రణ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆధికారంలో ఉన్న పార్టీకి వనరులపై గుత్తాధిపత్యం ఉండకూడదని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News