Thursday, January 23, 2025

స్వచ్ఛమైన నీటితో ఆరోగ్య సమస్యలు దరి చేరవు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : స్వచ్ఛమైన నీరు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని డాక్టర్ హరి కుమార్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ కోసం వైజర్ బీవరేజ్ ఆరా ఆల్కలైన్ వాటర్ బాటిల్స్, లోగో, అయోనైజర్ మెషిన్‌ను సినీ తారలతో బిర్లా ప్లానిటోరియంలో ప్రారంభించారు. ఈసందర్భంగా వాటర్ గ్లాస్ బాటిల్ తో నటీమణులు ఐశ్వర్య, సౌమ్యవేణు గోపాల్ ,సాహస్ కృష్ణ, హీరో శంకర్ సందడి చేశారు. అనంతరం సినీ నటుడు వెంకట గోవింద్ రావు మాట్లాడుతూ ఆరోగ్యంతో పాటు తమ చర్మ సౌందర్యానికి మంచి నీరేప్రధానకారణమన్నారు. ఆరోగ్యకరమైన నీటిని అందిస్తున్న ఆరా సంస్థను అభినందించారు.స్వచ్ఛమైన నీరు లభించకపోవడం వల్ల అనేక రకాల రుగ్మతలకు దారితీస్తుందని మహేష్, డైరెక్టర్ అమన్ దీప్ సింగ్ ,వైస్ ప్రసిడెంట్ షేక్ అన్వర్ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనిఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఆరా ఆల్కలైన్ విడుదల చేశామన్నారు. స్వచ్ఛమైన నీరు అనేక రకాల వ్యాధులైనక్యాన్సర్,అల్సర్,బీపీ, డయాబెటిస్, ఆర్థరైటిస్,హృదయ,ఉదర సంబంధాల వంటి రోగాల బారినపడకుండాఅయోనైజ్డ్ ఆల్కలైన్ నీరు కాపాడుతుందన్నారు. ఆరోగ్యంగా జీవించేందుకు ఆరా ఆల్కలైన్ నీటిని వాడాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో విశాల్,సాయి నితీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News