Friday, January 10, 2025

గుడ్లవల్లేరు కళాశాలలో రహస్య కెమెరాలేవీ లేవు : ఐజి

- Advertisement -
- Advertisement -

గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కళాశాలలో రహస్య కెమెరాలేమీ దొరకలేదని వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల అనుమానాలను తీర్చామని చెప్పారు. కెమెరాలు, వీడియోలు చూసినట్లు ఎవరూ చెప్పలేదన్నారు. క్రిమినల్ కేసుల్లో తొలిసారి సిఇఆర్‌టి సేవలు వినియోగించినట్లు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన సిఇఆర్‌టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందన్నారు. కొందరి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఆధారాలున్నా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని వెల్లడించారు. విద్యార్థుల భద్రతపై కళాశాల యాజమాన్యానికి తగు సూచనలు చేశామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News