Wednesday, January 22, 2025

‘నేను ఛస్తేనే బాగుంటుందేమో’

- Advertisement -
- Advertisement -

‘జీవితంపై ఆశ కోల్పోయాను. ఈ పరిస్థితుల్లో నేను చచ్చిపోవడమే మేలు. భార్యాబిడ్డలు అనారోగ్యంతో ఉన్నా చూసే వీలు లేదు. నేను బతికి ఏం లాభం?’ అంటూ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కోర్టులో కన్నీరుమున్నీరుగా విలపించారు.

మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న నరేశ్ గోయల్ ముంబయిలోని ఆర్థర్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కెనరా బ్యాంకుకు సంబంధించి 538 కోట్ల మనీ లాండరింగ్ లో ఆయన హస్తం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన శనివారం తన బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టుకు వచ్చారు. వ్యక్తిగతంగా సంభాషించాలని కోరడంతో న్యాయమూర్తి ఎంజీ దేశ్ పాండే అనుమతించారు. ఈ సందర్భంగా నరేశ్ గోయల్ న్యాయమూర్తి ఎదుట చేతులు జోడించి, విలపిస్తూ తన గోడును మొరపెట్టుకున్నారు.

తన భార్యకు కాన్సర్ అనీ, కుమార్తె ఆరోగ్యం కూడా బాగోలేదని, వారిని చూసుకునేందుకు ఎవరూ లేరని ఆయన వాపోయారు. తన వయసు 70 ఏళ్లనీ, ఆరోగ్యం సహకరించట్లేదని చెప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతికి ఉండటం కంటే చనిపోవడమే మేలనే అభిప్రాయానికి వచ్చాననీ, జైల్లోనే కన్నుమూసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన వేడుకున్నారు. ఈ వివరాలన్నీ కోర్టు రోజువారీ విచారణల రికార్డులలో నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News