Monday, December 23, 2024

ఫైనల్లో అతన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు: కమిన్స్

- Advertisement -
- Advertisement -

ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగే ప్రపంచ కప్ ఫైనల్లో విజయం కోసం ఇరుజట్లూ వ్యూహ రచనలో మునిగి తేలుతున్నాయి. రెండు మ్యాచ్ లు ఓడినా కోలుకుని, వరుస విజయాలతో ఫైనల్ చేరిన ఆసీస్ ఆట కట్టించేందుకు టీమిండియా పథకాలు రూపొందిస్తోంది. అలాగే అటు బౌలింగులోనూ, ఇటు బ్యాటింగులోనూ రాణిస్తూ, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన ఇండియాను ఎలా కట్టడి చేయాలా అని ఆసీస్ ఆటగాళ్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మ్యాచ్ కు ముందు జరిగిన విలేఖరుల సమావేశంలో కమిన్స్ మాట్లాడుతూ రోహిత్ సేన ఈ టోర్నమెంటులో కలసికట్టుగా రాణిస్తోందన్నాడు. అయితే తమను బాగా కలవరపెడుతున్నది పేసర్ మహ్మద్ షమీయేనని, అతని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నామని చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News