Monday, December 23, 2024

లంచం కేసుల్లో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదు: సుప్రీం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంఎల్‌ఎ, ఎంపిలు అవినీతికి పాల్పడితే విచారణ ఎదుర్కొవాల్సిందేనని కోర్టు తీర్పు వెల్లడించింది. చట్ట సభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు ఓటు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా 1998 నాటి తీర్పును ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. 2012లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశంలో పెను సంచలనం సృష్టించిన విషయం విధితమే. రాజ్య సభ ఎన్నికలలో ఆ పార్టీ శాసన సభ్యురాలు సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం తీసుకొని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు రావడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలి కోరుతూ సీతా హైకోర్టు తలుపుతట్టారు. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2019లో అప్పటి ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపి, ఎంఎల్‌ఎలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకొవచ్చా లేదా వారికి రక్షణ కల్పించాలా? అనే అంశంపై ఐదుగురు సభ్యుల గల రాజ్యాంగ ధర్మసనానికి సిఫార్సు చేసింది. పివి నరసింహరావు వర్సెస్ సిబిఐ కేసు విషయం సదర్భంగా సభలో చేసే ప్రసంగాలు, సభలో వేసే ఓట్లపై ఎంపిలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులు గల దర్మాసనం తీర్పును వెల్లడించడంతో పాటు ఈ అంశాన్ని పున:పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.

ఎంఎల్‌ఎ, ఎంపిలు చట్ట సభల్లో అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అవినీతికి పాల్పడితే పార్లమెంటరీ అధికారాల ద్వారా వారికి రక్షణ ఉండదని కోర్టు తెలిపింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని వివరించింది. లంచం తీసుకోవడం అనేది ప్రజాజీవితంలో విశ్వసనీయతను కోల్పోతుందని పేర్కొంది.

ఈ కేసు ఎలా జరిగిదంటే?
1993లో ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ సమయంలో జెఎంఎంకు చెందిన ఐదుగురు ఎంపిలు లంచాలు తీసుకొని అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జెఎంఎం మద్దతుతో పివి ప్రభుత్వం అవిశ్వాసంలో నెగ్గింది. జెంఎంఎం ఐదుగురు ఎంపిలపై సిబిఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News