Friday, November 15, 2024

కేజ్రీవాల్ బెయిల్ తీర్పు మరో రోజుకు వాయిదా !

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ఇంటెరిమ్ బెయిల్ పై నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వకుండా మరో తేదీకి వాయిదా వేసింది. తీర్పును మే 9న ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్ లాయర్ తో ‘ఒకవేళ తాత్కాలిక బెయిల్ ఇచ్చినట్లయితే, అతను అధికారిక విధులు నిర్వహించకూడదనుకుంటోంది. ఇది కాస్త వైరుధ్యంగా ఉంటుంది.

‘‘మేము ప్రభుత్వ పనితీరులో జోక్యం కలుగజేసుకోవాలనుకోవడం లేదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ ఎన్నికలు అనేవి లేకున్నట్లయితే ఎలాంటి తాత్కాలిక బెయిల్ ఇవ్వడం కుదరదని కూడా కోర్టు తెలిపింది. కాగా కోర్టు ఈడి దీర్ఘకాలిక దర్యాప్తుపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ అరెస్టును అసాధారణంగా కూడా కోర్టు భావించింది. కేజ్రీవాల్ ను అరెస్టు చేయడానికి ముందు, తర్వాతి కేసుఫైళ్లను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించడమేకాక, దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని ఆదేశించింది.

అయితే ఈడి తరఫు అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు కేసులో కేజ్రీవాల్ ఇన్వాల్వ్ మెంట్ అన్నది దర్యాప్తు తర్వాత దశలో వెలుగుచూసిందని కోర్టుకు తెలిపారు. ఆయన గోవా అసెంబ్లీ ఎన్నికలను కూడా హైలైట్ చేశారు. అప్పట్లో కేజ్రీవాల్ ఓ సెవన్-స్టార్ హోటల్ లో బస చేశారని కూడా తెలిపారు. ఆయన ఖర్చులన్నీ ఢిల్లీ ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ భరించిందని అన్నారు.

ఇదిలావుండగా సుప్రీంకోర్టు విషయాలు రాబట్టడానికి ఈడి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుందెందుకని ప్రశ్నించింది. సాక్షులను, నిందితిలను సూటిగా ఎందుకు ప్రశ్నించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా కేజ్రీవాల్ బెయిల్ ను తాను వ్యతిరేకిస్తున్నట్లు రాజు కోర్టుకు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News