Sunday, January 19, 2025

కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

- Advertisement -
- Advertisement -

ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తక్షణ విడుదలకు ఉత్తర్వు జారీ చేయడానికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నిరాకరించింది. అయితే, ఈ కేసులోతన అరెస్టు, ఇడి రిమాండ్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)కి నోటీస్ జారీ చేసి, పిటిషన్‌ను ఏప్రిల్ 3న విచారిస్తామని ప్రకటించారు. ఇడి ఈ నెల 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. కస్టడీలో దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక కోర్టు 22న ఆయనను ఆరు రోజుల పాటు ఇడి రిమాండ్‌కు పంపించింది. కేజ్రీవాల్‌ను గురువారం ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తారు.

ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేయడం రాజ్యాంగం మౌలిక స్వరూపానికే విరుద్ధమని వాదిస్తూ తనను ఇడి కస్టడీలో నుంచి వెంటనే విడుదల చేసేలా ఉత్తర్వు జారీ చేయాలని కోర్టును కేజ్రీవాల్ అభ్యర్థించారు. ఆప్ నేత కేజ్రీవాల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎఎం సింఘ్వి వాదిస్తూ, ‘అరెస్టు లక్షం వాస్తవాలు కనుగొనడం కాకుండా నన్ను, నా పార్టీనీ ఇబ్బందిలోకి నెట్టడమే. నన్ను ఇప్పుడు విడుదల చేయవలసిందని నా ప్రార్థన’ అని అన్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నిర్దేశించినట్లుగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవలసిన ‘అవసరం’ లేదని,‘సహాయ నిరాకరణ’ కారణాలను ఇడి చాలావరకు దుర్వినియోగం చేసిందని సింఘ్వి వాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News