Monday, December 23, 2024

సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం రాలేదు: రాజ్‌భవన్ స్పష్టీకరణ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీకి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈసారి నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవం చుట్టూ వివాదం రాజుకుంటోంది. ఆహ్వానం పంపించినప్పటికీ గవర్నర్ ఆదివారం నాడు నూతన పచివాలయ భవన ప్రారంభోత్సవానికి హాజరుకాలేదంటూ మీడియాలో కథనాలు వెలువడిన నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం మంగళశారం స్పందించింది.

తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానమే అందలేదని గవర్నర్ కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ గవర్నర్‌కు ఆహ్వాన లేఖను పంపినప్పటికీ ఆమె రాలేదన్న వార్తలు పూర్తి అవాస్తవమని, ఇవన్నీ తప్పుడు ఆరోపణలని గవర్నర్ కార్యాలయం ఖండించింది. గవర్నర్‌కు ఎటువంటి ఆహ్వానం అందలేదని, ఈ కారణంగానే నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ రాలేదని రాజ్‌భన్ స్పష్టం చేసింది.

Also Read: ఎన్‌టిఆర్ జిల్లాలో అప్పుడు తండ్రిని… ఇప్పుడు తల్లిని చంపాడు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News