Wednesday, April 16, 2025

ఐపిఎల్‌లో కనిపించని జోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యంత జనాదారణ కలిగిన క్రికెట్ లీగ్‌గా ఐపిఎల్ పేరు తెచ్చుకుంది. క్రికెట్‌లో ఎన్నో లీగ్‌లు ఉన్నా ఐపిఎల్‌కు ఉన్నా క్రేజ్ మరే లీగ్‌కు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏడాది జరిగే ఈ టోర్నమెంట్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో దాదాపు రెండు నెలల పాటు ఐపిఎల్ మ్యాచ్‌లు సందడి చేస్తాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లో జరిగే మ్యాచ్‌లకు ఉండే ఆదరణ మాటల్లో వర్ణించలేము.

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపిఎల్ మ్యాచ్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టడం అనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఉప్పల్ వేదికగా 9 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఈసారి పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. నాలుగు మ్యాచుల్లో సన్‌రైజర్స్ రెండింటిలో పరాజయం చవిచూసింది. ఇక హైదరాబాద్ వేదికగా సాగిన మ్యాచ్‌లపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే చెప్పాలి. గతంలో ఉన్న జోష్ ఈసారి కనిపించడం లేదు. మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులు స్టేడియానికి భారీగానే తరలివస్తున్నా ఒకప్పటి సందడి వాతావరణం మాత్రం లేదనే చెప్పాలి.

సిక్సర్లు, ఫోర్లు కొట్టినా అభిమానుల నుంచి పెద్దగా స్పందన లభించడం లేదు. ఒకప్పుడూ అభిమానులు చేసే కేరింతలు, నృత్యాలు, కేకలతో మైదానంలో పండుగ వాతావరణం కనిపించేది. కానీ ఈసారి మైదానాల్లో హల్‌చల్ ఉండడం లేదు. దాదాపు ప్రతి మ్యాచ్ చప్పగా సాగిపోతోంది. కిందటి సీజన్‌లో హైదరాబాద్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి తదతితరులు విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను కనువిందు చేశారు. కానీ ఈసారి వారి బ్యాటింగ్‌లో అప్పటి జోష్ లేదు. ఇది కూడా క్రికెట్ ప్రేమీకులను నిరాశకు గురి చేసిన అంశంగా చెప్పలేదు. పంజాబ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో తప్పిస్తే హైదరాబాద్ బ్యాటర్లు తమ మార్క్ బ్యాటింగ్‌తో అలరించలేదు. పంజాబ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పూర్వవైభవాన్ని సంతిరించు కోవడంతో రానున్న మ్యాచుల్లోనైనా అభిమానుల్లో కొత్త జోష్ నెలకొనే ఛాన్స్ ఉంది.

అన్ని చోట్ల ఇదే పరిస్థితి..

ఒక్క హైదరాబాద్ అనే కాకుండా ఇతర వేదకల్లో జరుగుతున్న మ్యాచ్‌లకు కూడా పెద్దగా ఆదరణ లభించడం లేదు. ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో జరిగే మ్యాచ్‌లపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ ఐపిఎల్ చాలా సాదాసీదాగా సాగిపోతోంది. అంతేగాక ఒకప్పుడూ ఐపిఎల్ మ్యాచుల్లో సినీ, బిజినెస్ ప్రముఖులు సందడి చేసే వారు. సెలబ్రిటీలు పెద్దగా సంఖ్యలో స్టేడియాలకు తరలివచ్చే వారు. దీంతో మైదానాల్లో సందడి నెలకొనేది. కానీ ఈసారి మాత్రం సెలబ్రిటీలు కూడా ఐపిఎల్‌ను పట్టించుకున్న దాఖలలు లేవు. మిగిలిన మ్యాచుల్లోనైనా ఐపిఎల్ మ్యాచ్‌లకు ఆదరణ లభిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News