Wednesday, April 30, 2025

ఆస్తులు లేని కేరళ మాజీ ఆర్థిక మంత్రి

- Advertisement -
- Advertisement -

కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వీటిలో ఆయన తనకు ఆస్తులు బంగారం వంటివి ఏమీ లేవని, తన వద్ద ఉన్నది కేవలం పుస్తకాల సంపదనే అని తెలియచేసుకున్నారు. థామస్ కేరళలోని పత్థనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం స్థానం నుంచి ఎల్‌డిఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన మాజీ ఆర్థిక మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు. అయితే ఆయన నిరాడంబర జీవితం , సామాన్య కుటుంబ జీవనశైలిని తెలిపే విధంగా పత్రాలలో వివరాలు ఉన్నాయి.

తన వద్ద 20000కు పైగా పుస్తకాల సేకరణ ఉందని , దీని విలువ దాదాపు రూ 10 లక్షల వరకూ ఉంటుందని తెలియచేసుకున్నారు . ఇవి కూడా ఆయన తిరువనంతపురంలోని తన సోదరుడి ఇంట్లోనే భద్రపర్చి ఉన్నాయి. థామస్ కూడా అక్కడనే నివసిస్తున్నారు. ఇక తన వద్ద రూ 6000 ల సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల బాండ్స్, రూ 68000 ల పెన్షనర్స్ అకౌంట్ ఖాతా , ఎస్‌బిఐలో రూ 39000ల బ్యాలెన్స్ ఉందని తెలిపారు. కొన్ని చిట్‌ఫండ్స్‌లలో చిట్స్ ఉన్నాయని పూర్తి వివరాలను తెలియచేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News