Thursday, January 23, 2025

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేం: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధంగా గుర్తించలేమని సుప్రీంకోర్టు మంగళవారం తెలియచేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ అనుమతి కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించి తగిన చట్టాలను రూపొందించే బాధ్యతను పార్లమెంట్‌కే సుప్రీంకోర్టు వదిలిపెట్టింది.

లైంగిక ప్రత్యేకత ఆధారంగా సహజీవనం చేయడాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కులను సహజీవనం చేసే హక్కుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వివక్ష చూపలేవని కోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కులు ఉమ్మడిగా శిశువును దత్తత తీసుకోవచ్చని కూడా కోర్టు తెలిపింది. ప్రస్తుత చట్టాల ప్రకారం ట్రాన్స్‌జెండర్లతోపాటు స్వలింగ సంపర్కులకు వివాహం చేసుకునే హక్కు ఉందని కోర్టు తెలిపింది. అటువంటి జంటలకు కల్పించే హక్కులను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ఇర్రకే తెలిపారని సిజెఐ డివై చంద్రచూడ్ తన తీర్పులో వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News