Tuesday, September 17, 2024

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బిఎస్పీ అధికారంలోకి రావడం ఖాయం

- Advertisement -
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో బిసిలకు 60 నుంచి 70 స్థానాలు కేటాయిస్తాం: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

మన తెలంగాణ/ హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బిఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జహీరాబాద్,మహబూబ్ నగర్, దేవరకొండ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు తమ పార్టీలకు రాజీనామా చేసి 2500 మందికి పైగా ఆపార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలన చేసే పార్టీలకు చరమగీతం పాడాలని ప్రజలను కోరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ అసెంబ్లీ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన గోపీని పార్టీ నుంచి బలవంతంగా బయటకు గెంటివేశారని మండిపడ్డారు.

సూర్యాపేటలో వట్టే జానయ్యను చంపేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సూర్యాపేటలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. వట్టే జానయ్య సతీమణి రేణుకను సూర్యాపేటలో డా. బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఎస్పీ మద్దతు లేకుండా తెలంగాణలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని జోస్యం చెప్పారు. కాన్షీరాం స్ఫూర్తితో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని, అందుకోసం కోసం పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వాడ వాడల బహుజనవాదాన్ని వినిపించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News