Sunday, December 22, 2024

ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ ఆగదు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన పీపుల్ మార్చ్ పాదయాత్ర ఫైలాన్‌ను శుక్రవారం రాత్రి ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క తో మాజీ ఎంపి వి.హన్మంతరావు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ,చెరుకు సుధాకర్, బెల్లయ్య నాయక్, కత్తి వెంకటస్వామి డిసిసి అధ్యక్షులు దుర్గాప్రసాద్, పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, మహమ్మద్ జావిద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎస్టీ సెల్ అధ్యక్షులు బెల్లయ్య నాయక్, ఓయూజేఏసీ విద్యార్థి సంఘం చైర్మన్ లోకేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. అదిలాబాద్ జిల్లా పిప్రి మండలం నుంచి ప్రారంభమైన పాదయాత్ర. 106రోజుల పాటు కొనసాగి, శుక్రవారం 107వ రోజు 1300 కిలోమీటర్ల దూరంపాటు,45 నియోజకవర్గాలో పాదయాత్ర పూర్తి చేశారు జూలై 2న ఖమ్మంలో బహిరంగ సభతో ఈ పాదయాత్ర ముగుస్తుంది.

  • ఎన్ని ఆటంకాలు సృష్టించినా విజయవంతం చేస్తాం : భట్టి

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో జూలై 2న నిర్వహించే రాహుల్ గాంధీ జనగర్జన సభకు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించిన, కాంగ్రెస్ కార్యకర్తలు కదం తొక్కుతూ కదిలి రావడం ఖాయం. లక్షల మందితో సభ విజయవంతం అవుతుందని సి ఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క్ అన్నారు. ఫైలాన్ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు వాహనాలు ఇవ్వకుండా వాటి యజమానులను అధికారులతో బెదిరింపులకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్పడటాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాదయాత్ర చేసిన గ్రామాల్లో ఆ ప్రజలకు మాట ఇచ్చి వచ్చాను వారి సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చాను.

ఆదివాసీ బిడ్డలకు తిరిగి పోడు భూములపై హక్కులు కల్పిస్తామని, కొలువులు రాక గడ్డాలు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతున్న యువతను చూసి గుండెలు పగిలి రోధిస్తున్న తల్లిదండ్రులకు వారి ఆకాంక్షలు నెరవేర్చుతానని, బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి కొలువులు లేక పెళ్లిళ్లలో క్యాటరింగ్ చేస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చి వచ్చాను. బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి నేడు అడవి బిడ్డలకు పోడు పట్టాలు పంపిణీ మొదలుపెట్టారని వి.హన్మంతరావు అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైందని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పాదయాత్రలో వెలుగు చూశాయన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News