Sunday, December 22, 2024

ఏ ఆపద వచ్చినా వెన్నంటే ఉంటా

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తాను వెన్నంటే ఉంటానని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ అన్నారు. ఆదివారం కారేపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే పర్యటించారు. చిన్నమడెంపల్లిలో జిగట ముత్తయ్య ఇంట్లోఇటివల వివాహం జరగటంతో ఆయన ఇంటికి వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్తూరుతండాలో ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బానోత్ ప్రశాంత్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళ్లు అర్పించి, ప్రశాంత్ తండ్రి బానోత్ హతీరాంకు సానుభూతిని తెలిపారు. అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న అరవింద్ ను పరామర్శించారు.

కొమ్ముగూడెం, ముత్యాలగూడెం, కారేపల్లి బీసీ కాలనీ, గంగారంతండా, గేటుకారేపల్లి, మేకలతండా, భజ్యాతండా, బబొక్కలతండా లలో పర్యటించి బాధితులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, రైతు బంధు జిల్లా సభ్యులు ఉన్నం వీరేందర్, బీఆర్‌ఎస్ నాయకులు హన్మకొండ రమేష్, ఎస్‌కె.గౌసుద్దీన్, అజ్మీర నరేన్, గడ్డం వెంకటేశ్వర్లు, రవీందర్, సోమందుల నాగరాజు, జడల కళ్యాణ్, భూక్యా మోతీలాల్, సుడిగాలి మన్మధరావు, బల్లి అప్పారావు, హరీష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News