Saturday, December 21, 2024

మోటార్లకు మీటర్లు పెట్టాలనలేదు

- Advertisement -
- Advertisement -

ఇఆర్‌సి గురించి వ్యాఖ్యానించేటప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి
బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు వ్యాఖ్యలపై
ఇఆర్‌సి చైర్మన్ శ్రీరంగారావు

ట్రాన్స్‌ఫార్మర్లకే పెట్టాలని చెప్పాం

మనతెలంగాణ/హైదరాబాద్: ట్రాన్స్‌ఫా ర్మర్లకు మాత్రమే మీటర్లు పెట్టాలని, ఎక్క డ కూడా బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పలేదని, అవగాహన లేకనే బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు మాట్లాడుతు న్నారని ఇఆర్‌సి చైర్మన్ శ్రీరంగరావు ఆరో పించారు. బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై ఇఆర్‌సి చైర్మన్ శ్రీరంగారావు సోమవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో పలు అంశా లపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీరంగారావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలకు కొన్నీ కీలకమైన డైరెక్షన్లు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే వ్యవసాయ రంగంకు విద్యుత్ సరఫరా సంబంధించి కొన్ని డైరెక్షన్‌లు ఇచ్చామని ఆయన తెలిపారు.వ్యవసాయ బావులకు సంబంధిం చి ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెట్టాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఆదేశించామని ఆయన తెలిపారు. ఈఆర్సీ కమిషనే మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేయడం సరైంది కాదని శ్రీరంగారావు పేర్కొన్నారు.

కమిషన్‌పై మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకొని మాట్లాడాలని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు సూచించారు. బావుల వద్ద మీటర్లు పెట్టాలని, ఈఆర్సీ వల్లే పెట్టాల్సి వస్తోందని బిజెపి ఎమ్మెల్యే అంటున్నాడని, ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేక, లేదా అర్థం కాక అలా మాట్లాడి ఉంటాడని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగం సంబంధించి ఎలాంటి మీటర్లు పెట్టాలని తాము చూపించలేదని శ్రీరంగారావు పేర్కొన్నారు. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావుకు తాను విద్యుత్ సంస్థలకు చేసిన సలహాలు, సూచనల కాపీని పంపిస్తానని దానిని రఘునందన్ రావు చదువుకోవాలని శ్రీరంగారావు సూచించారు. రఘునందన్ రావు ఎలాంటి అవగాహన లేక మాట్లాడని ఆయన పేర్కొన్నారు. నేడు కామారెడ్డి జిల్లాలో తమ ఈఆర్సీ బృందం పర్యటిస్తుందని శ్రీరంగారావు తెలిపారు. గత నెలలో విద్యుత్‌కు సంబంధించిన టారిఫ్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, ఈ టారిఫ్ ఆర్డర్‌తో పాటు కొన్ని సలహాలు, సూచనలు కూడా డిస్కంలకు ఇచ్చామని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News