Thursday, November 21, 2024

సిసోడియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయి: ముకుల్ రోహత్గీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎంఎల్‌సి కవిత బెయిల్ పిటషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేసింది. ఎంఎల్‌సి కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇడి కేసులో కవిత ఐదు నెలలుగా జైలులో ఉన్నారని, ఈ కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలు అని, కవిత మాజీ ఎంపి అని, ఆమె ఎక్కడికీ వెళ్లరని ముకుల్ స్పష్టం చేశారు. రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, కవిత నుంచి ఇప్పటివరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదన్నారు. ఇదే కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరైందని, సిసోడియాకు వర్తించిన నిబంధనలే కవితకు వరిస్తాయని ముకుల్ కోర్టుకు విన్నవించారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత అప్పగించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News