Thursday, January 23, 2025

టిఎస్‌ఐపాస్, హెచ్‌టి సర్వీసుల మంజూరులో జాప్యం వద్దు : టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌ఐపాస్, హెచ్ టి సర్వీసుల మంజూరులో జాప్యం లేకుండా రిలీజ్ చెయ్యాలని, మీసేవలో దరఖాస్తు చేసుకున్న వాటిని మరింత త్వరితగతిన మంజూరు చెయ్యాలని టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు అధికారులను ఆదేశించారు. దత్తత తీసుకున్న గ్రామాలలో సమస్యలను పరిష్కరించి పనులను వెంటనే పూర్తి చెయ్యాలన్నారు. కాలిపోయిన, పనిచేయని విద్యుత్ మీటర్ల ను మార్చాలని, అలాగే రెండు సంవత్సరాలు పై బడిన వర్క్ ఆర్డర్లు ను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ మేరకు గురువారం హన్మకొండ, కార్పోరేట్ కార్యాలయంలో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎండి అన్నమనేని గోపాల్ రావు మాట్లాడుతూ రూ.50 వేలపై బడిన వసూలు కాని బకాయిలను వసూళ్ళు చేయాలని అధికారులను ఆదేశించారు. 33/11 కెవి అంతరాయాలను తగ్గించాలని, ఓవర్లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు లైన్ల నిర్వహణ చేపట్టాలని, ఐఆర్డీఏ కాని మీటర్లను మార్చాలన్నారు.

అపార్ట్మెంట్ల పరంగా ఎనర్జీ ఆడిట్ నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్(హెచ్ ఆర్ డి ,పి అండ్ ఎంఎం) బి.వెంకటేశ్వర రావు, డైరెక్టర్ (ఐపిసి అండ్ ఆర్‌ఎసి) పి.గణపతి, డైరెక్టర్ (కమర్షియల్) పి.సంధ్యారాణి, డైరెక్టర్(ప్రాజెక్ట్, ఆపరేషన్) పి.మోహన్ రెడ్డి, ఇంచార్జ్ డైరెక్టర్ (ఫైనాన్స్) వి.తిరుపతి రెడ్డి , సిజియంలు, ఎస్‌ఈలు, డీఈలు, ఎస్‌ఏఓలు, డిఈ(ఐటి)లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News