Saturday, December 21, 2024

ఫ్రీ 5జి సేవలు ఇక లేనట్లే!

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఖర్చులను తట్టుకోవడం కోసం టెలికాం రంగ సంస్థలు టారిఫ్‌లను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్‌లిమిటెడ్ ఫ్రీడేటా ప్లాన్‌లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు ఈ ఏడాది జూన్‌నుంచి 4 జితో పోలిస్తే 5 జి సేవలకు కనీసం 510శాతం ఎక్కువ చార్జి విధించవచ్చని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. టెలికాం కంపెనీలు 5జి నెట్‌వర్క్ కోసం భారీగా పెట్టుబడి పెట్టాయి.ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో రెండు టెలికాం అపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను కనీసం 10 శాతం పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. కస్టమర్లను 5జికి అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడం కోసం ఈ రెండు కంపెనీలు 5జి అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్లతో పాటుగా 4జి ధరలకే 5జి డేటాను అందిస్తున్నాయి.

జనం 5జికి అలవాటు పడినందున టెలికాం కంపెనీలు మానిటైజేషన్‌పై దృష్టిమరల్చినట్లు నిపుణులు చెబుతున్నారు.ఈ రెండు సంస్థలు త్వరలోనే 5జి కోసం ప్లాన్‌లను ప్రకటించవచ్చని జెఫ్రీన్ ఓ రిసెర్చ్ నోట్‌లో తెలియజేసింది. ఎయిర్‌టెల్, జియో 5జి రేట్లు 4జికంటే దాదాపు 10 శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. అలాంటి ప్లాన్లకు అదనంగా 30 40 శాతం డేటాను జోడించి మార్కెట్ షేరును పెంచుకుని లాభాలను పొందవచ్చని తెలిపింది. తగిన సమయంలో చార్జీలు పెంచడానికి వెనకాడబోమని ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ గతంలో చెప్పారు. ప్రతి కస్టమర్‌నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని ప్రస్తుతం ఉన్న రూ.200నుంచి రూ.250కు పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్‌టెల్‌కు కలిపి ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జి యూజర్లు ఉన్నారు.2024 చివరి నాటికి 20 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News