గోషామహల్: ఇప్పటి నుంచి ప్రభుత్వ వైద్యుల సమస్యలపైనా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పోరాటం చేస్తుందని ఇండి యన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ బిఎన్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కోఠిలోని అసోసియేషన్ కార్యాల యంలో ఆయన ఐఎంఏ ప్రతినిధులతో కలిసి టిటిజిడిఏ, టిపిహెచ్‌డిఏ, వివిపిజిడిఏ తదితర ప్రభుత్వ వైద్యుల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యా రు.
ఈ సందర్బంగా వైద్య సంఘాల నాయకులు వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై చ ర్చించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రభుత్వ వైద్యులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అన ంతరం ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బిఎన్ రావు మాట్లాడుతూ టీఎస్‌ఎంసీ ఎన్నికల్లో ఐఎంఏ అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. ఇక నుంచి ప్రభు త్వ వైద్యులతో కలిసి ఐఎంఏ పని చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజయ్ రావు, మాజీ అధ్యక్షులు డాక్టర్ నర్సింగా రెడ్డి, తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అన్వర్, ప్రధాన కార్యదర్శి జలగం తిరుపతిరావు, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూర్ణచందర్, వైద్య విధాన పరిషత్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.