Sunday, December 22, 2024

మొదటిసారి ముస్లింలకు ప్రాతినిధ్యం లేని కేంద్ర క్యాబినెట్

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఆదవారం సాంయత్రం ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ప్రమాణం చేసిన మంత్రులలో ముస్లిం సమాజం నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. మోడీ క్యాబినెట్‌లో ముస్లిం ఎంపీకి చోటు దక్కకపోవడం ఇదే మొదటిసారి. భారతదేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం మూడవ పర్యాయం బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఘనత దేశ తొలి ప్రధాని జవహర్‌ఆలా నెహ్రూ తర్వాత మోడీకే దక్కింది. అయితే 2019లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినపుడు మంత్రిగా ర్యాసభ సభ్యుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రమాణం చేశారు. ఆయనకు మైనారి వ్యవహారాల శాఖను అప్పగించారు. అయితే 2022లో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగిసి తిరిగి ఎన్నిక కాకపోవడంతో ఆ శాఖ ఖాళీగానే ఉండిపోయింది.

2014లో మోడీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు మైనారీ వ్యవహారాల మంత్రిగా నజ్మా హెప్తుల్లా ప్రమానం చేశారు. 199లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు షానవాజ్ హుస్సేన్, ఓమర్ అబ్దుల్లా మంత్రులుగా పనిచేశారు. 1998లో వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో కూడా నఖ్వీ సహాయ మంత్రిగా పనిచేశారు. కాగా..ఇప్పుడు ప్రధాని మోడీతోపాటు ప్రమాణం చేసిన 71 మంది మంత్రులలో 30 మందికి క్యాబినెట్ హోదా, ఐదుగురికి ఇండిపెండెంట్ చార్జీలు, 36 మందికి సహాయ మంత్రులుగా చోటు దక్కింది. అయితే వీరిలో ముస్లిం ఎంపీలు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. అయితే..ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లభించనప్పటికీ పార్లమెంట్‌లో మాత్రం పెద్ద సంఖ్యలో ప్రతిపక్షంలో ముస్లిం ఎంపీలు ఉండనున్నారు. ఇండియా కూటమి నుంచి 21 మంది ముస్లిం ఎంపీలతోపాటు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, ఇద్దరు ఇండిపెండెంట్ ముస్లిం ఎంపీలు పార్లమెంట్‌లో ప్రతిపక్షంలో కూర్చోనున్నారు.

ఇండిపెండెంట్ ఎంపీలలో జమ్మూ కశ్మీరు నుంచి అబ్దుల్ రషీద్ షేక్ లేక ఇంజనీర్ రషీద్, మొహమ్మద్ హనీఫా ఉన్నారు. ఇలా ఉండగా, ఎంపీలు కాకపోయినప్పటికీ ఇద్దరు సిక్కు, క్రైస్తవ ఎంపీలకు మోడీ క్యాబినెట్‌లో చోటు దక్కడం విశేషం. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ రాజా సింగ్ చేతిలో ఓటమిపాలైన రవనీత్ సింగ్ బిట్టూకు, మూడు దశాబ్దాలుగా బిజెపినే నమ్ముకున్న జార్జి కురియన్‌కు మోడీ తన క్యాబినెట్‌లో చోటు కల్పించారు. ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన బిట్టూగతంలో కాంగ్రెస్‌లో ఉండి ఈ ఏడాదే బిజెపిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News