Friday, November 22, 2024

అప్పర్ భద్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :ఒక వైపు దేశంలోనే అత్యల్పవర్షపాత ప్రాంతాలుగా రికార్డుకెక్కిన తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమ , దక్షిణ తెలంగాణ ప్రాంతాలు నీటి వసతి లేక నిత్యక్షామం తో విలవిలలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కలేదు. కాళేశ్వరం ..కాదంటే పాలమూరు-రంగారె డ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఆరేళ్లుగా కేసిఆర్ సర్కారు కేంద్రానికి చేస్తున్న విజ్ణప్తులు బుట్టదాఖలవుతున్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ అన్నతీరులో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుల ప్రకటనలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చి కర్నాటక రాష్ట్రంపై ఎనలేని అభిమానం చూపింది. అంతే కాకుండా ఈ ప్రా జెక్టుకు 2023-24వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా రూ.5300కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం రూ.21473కోట్ల వ్యయాన్ని కేంద్ర ప్ర భుత్వమే భరించనుంది. దశల వారీగా నిధులు విడుదల చేయనుంది.

తొలివిడతగా రూ.8వేలకోట్లు అవసరం అని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపగా అందు లో తక్షణమే నిధులు విడుదల చేసేందుకు కేం ద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు జరిగిపోయాయి.కృష్ణా నదీపరివాహక ప్రాంతంలోని తుంగభద్ర ఉపబేసిన్ కింద అప్పర్ భద్ర భారీ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల అనుమతు లు ఇచ్చేసింది. మొత్తం రెండు దశలో 46టిఎంసీల నీటిని ఉపయోగించుకుని క్షామపీడిత ప్రాంతాలైన చిక్‌మంగుళూరు, చిత్రదుర్గ, తుముకూరు, ధావనగెరి జిల్లాల పరిధిలో 5.62లక్షల ఎకరాలకు సాగునీరందించటం లక్షంగా కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఖరీఫ్‌లో సుస్థిర వ్యవసాయం కోసం నీటిపారుదల సదుపాయం కల్పించనుంది. ఎంపిక చేసిన ఆయకట్టు ప్రాంతాల పరిధిలోని 367 చెరువులను అప్పర్ భద్ర ఎతిపోతల పథకం ద్వారా తుంగభధ్ర జాలతో నింపనుంది.

రెండు దశల్లో చేపట్టిన ఈ పధకంలో మొదటి దశ కింద 17టిఎంసీల నీటిని తుంగ నుంచి భద్ర కు , రెండవ దశకింద 29టిఎంసీల నీటిని భద్ర నుంచి తుంగకు తరలిస్తారు. తుంగభద్ర సబ్‌బేసిన్‌లో అజ్జమ్‌పూర ప్రాంతం నుంచి ఎత్తిపోతల పధకాల ద్వారా ఈ నీటిని తరలించనున్నారు. కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్ తుంగ ఎత్తిపోతల పథ కం వల్ల దిగువన ఉన్న తెలుగు రాష్ట్రాలకు కృష్ణానదీజలాల్లో మరింత అన్యా యం జరుగుతుందని ఈ రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆల్మట్టి ప్రాజెక్టు వల్ల సీజన్‌లో సకాలంలో దిగువకు నీరు రాక సెప్టెంబర్ దాకా ఎదురు చూడాల్సివస్తోందని దీనివల్ల ఖరీఫ్ పంటల సాగు ఆలస్యమయి ఆశించిన పంట దిగుబడులు పొందలేక నష్టపోతున్నారు. ఇక అప్పర్ భద్ర ద్వారా 46టీఎంసీలు కూడా వినియోగిస్తే దిగువకు నీటివిడుదల మరింత జాప్యం జరుగుందంటున్నారు. కర్ణాటక రా్రష్ట్రంలో కూ డా విపక్షాల నుంచి అప్పర్ తుంగపట్ల విమర్శలు వెల్లువెత్తాయి.

అసలు నో టిఫికేషన్ కూడా వెల్లడించని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.5300కోట్లు కేటాయించటం హాస్యాస్పదం అని ఆ రాష్ట్ర విపక్ష నేత సిద్దరామయ్య ఆరోపించారు. అనుమతి లేని ప్రాజెక్టులకు నిధులెలా ఖర్చు చేస్తారని నిలదీశారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు డి.కె.శివకుమార్ భద్ర ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.16వేలకోట్లు వ్యయం చేసినట్టు వెల్లడించా రు. సిఎం బసవరాజస్పందిస్తూ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటించి నిధులు కేటాయించటంతో కర్ణాటకలో ఇది ఏకై క జాతీయ ప్రాజెక్టుగా నిలిచిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News