Monday, March 31, 2025

పాలమూరుకి జాతీయ హోదా.. షాకిచ్చిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కృష్ణానదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. ఈ మేరకు పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ.. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును కేంద్రం తిరస్కరించింది. ఈ ప్రాజెక్టు న్యాయపరమైన చిక్కులు, టెక్నికల్ అంశాలు ఉన్నాయని పేర్కొంది. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే అంశాన్ని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో లేవనెత్తారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి రాజ్‌భూషణ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపానలను తిరిగి పంపినట్లు లోక్‌సభకు వెల్లడించారు. 2024 డిసెంబర్‌లోనే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News