Monday, December 23, 2024

ఆ ఖాతాలకే మినిమం బ్యాలన్స్ పెనాల్టీలు: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

ప్రధాన మంత్రి జన్‌ధన్ ఖాతాలు, పేదలకు చెందిన సేవింగ్స్ ఖాతాలలో మినిమం బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించారు. తమ బ్యాంకు ఖాతాలలో తగిన మొత్తంలో బ్యాలన్స్ తప్పనిసరిగా ఉంచాల్సిన ఖాతాదారులు ఆ నిబంధనను పాటించనప్పుడే వారికి బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయని రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానమిచ్చారు.

మినిమం బ్యాలన్స్ పాటించని ఖాతాదారుల నుంచి గత ఐదేళ్లలో రూ. 8,500 కోట్లు పెనాల్టీలుగా బ్యాంకులు వసూలు చేసినట్లు వచ్చిన వార్తలపై అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ మినిమం బ్యాలన్స్ అన్న నిబంధన జన్ ధన్ ఖాతాలకు, పేదలకు సంబంధించిన మౌలిక ఖాతాలకు వర్తించదని స్పష్టం చేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో నెలసరి మినిమం బ్యాలన్స్ పాటింస్ఖాతాదారుల నుంచి రూ. 2,331 కోట్లను పెనాల్టీలుగా బ్యాంకులు వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News