కూకట్‌పల్లి: 59 జివోపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నా రు. 59 జివో కింద నోటీసులు అందుకున్న పలువురు పాపిరెడ్డినగర్‌లోని నివాసితుల ఇండ్లను కూల్చేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నించగా స్ధానిక నేతల పిలుపుమేరకు సంఘటనా స్ధలానికి చేరుకున్న గాంధీ ఆదేశాలతో వెనుతిరిగారు. ఇదే సమస్యపై గాంధీ ముఖ్యమంత్రి కెసిఆర్, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌లకు చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డితో కలిసి నివేదిక సమర్పించి పేదలు అధికంగా ఉన్న బస్తీల్లో క్రమబద్ధ్దీకరణకు అత్యధిక ఉబ్బులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించగా వారు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించినట్లు గాంధీ గురువారం పాపిరెడ్డినగర్ కంటెస్టడ్ అ ధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పలువురు బస్తీవాసులు కలిసిన సందర్భంలో తెలియజేసినట్లు శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
సమస్యకు శాశ్వత పరిష్కారం చేపేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే గాంధీకి శ్రీధర్‌రెడ్డి కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మాయ రాజయ్య, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, ఈరెడ్డి దేవేందర్ రెడ్డి, మాయ బాలనర్సయ్య, చిట్టిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఎడ్ల సంపత్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మహేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.