Monday, November 18, 2024

కొవాగ్జిన్‌పై మరింత సమాచారం కోరిన డబ్లుహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -
No Nod for Covaxin Yet as WHO Seeks More Data
నవంబర్ 3 న అనుమతిపై నిర్ణయం ?

జెనీవా : కొవిడ్ టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సంబంధించిన అనుమతిపై తుది సమీక్షకు గాను భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ ) సాంకేతిక సలహా బృందం నిర్ణయించింది. ఈ వారాంతంలో భారత్ బయోటెక్ నుంచి అవసరమైన సమాచారం అందుతుందని సాంకేతిక సలహా బృందం భావిస్తోంది. ఈమేరకు నవంబరు 3న తుది సమీక్షకు భేటీ కానున్నట్టు డబ్లుహెచ్‌ఒ మంగళవారం వెల్లడించింది. అయితే అంతకు ముందు డబ్లుహెచ్ వొ ప్రతినిధి డాక్టర్ మార్గరెట్ హారిస్ విలేఖరులతో మాట్లాడుతూ కొవాగ్జిన్ అత్యవసర అనుమతిపై ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిపారు. టీకా అత్యవసర వినియోగ అనుమతిపై సిఫార్సు చేసే విషయమై మంగళవారం డబ్లుహెచ్‌ఒ కమిటీ సమీక్ష నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News