- Advertisement -
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలును ఎవరూ ఆపలేరని ప్రధాని మోడీ అన్నారు. తాను ఉన్నంత వరకు సిఎఎను రద్దు చేయనివ్వనని చెప్పారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ లో మోడీ పర్యటించారు. నార్త్ 24పరగణ జిల్లాలోని బరాక్ పూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ…తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, హిందువులను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అవినీతికి కేంద్రంగా మారిందని ఫైరయ్యారు. చొరబాటు దారులను టిఎంసి కాపాడుతుందని పిఎం చెప్పారు.
రాష్ట్రంలో జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్ కేసుల ప్రజల నుండి టిఎంసి దోపిడీ చేసిన డబ్బును చట్టబద్ధంగా తిరిగి ప్రజలకు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. అవినీతి నేతలను వదిలిపెట్టబోమని ప్రధాని హెచ్చరించారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు మే 13న నాలుగో దశ ఎన్నికల్లో ఓటింగ్ జరగనుంది.
- Advertisement -