Sunday, January 19, 2025

బిఆర్ఎస్ కు ఒక్క సీటు రాకున్నా.. వచ్చే నష్టం లేదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పోటీ పడాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో పోటీకి ఎలాంటి అజెండా లేదని చెప్పారు. బిఆర్ఎస్ ఒక్క సీటు రాకున్నా జనానికి వచ్చే నష్టం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ లో అన్ని ఎంపి సీట్లు గెలుస్తున్నామని ఆయన వెల్లడిచారు.

కర్నాటకలో 25 సీట్లు బిజెపి గెలవబోతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 3-4 సీట్లు గెలిచినా రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని చెప్పారు. మోడీని మరోసారి ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని కిషన్ రెడ్డి జోస్య చెప్పారు. తెలంగాణలో అత్యధిక సీట్లు బిజెపి గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. అలవికాని హామీలిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సోనియా కుటుంబానికి సేవ తప్ప.. హామీల అమలుపై కాంగ్రెస్ కు దృష్టి లేదని చెప్పారు. హమీలు నెరవేర్చడానికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News