Saturday, November 16, 2024

బాల్కొండ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు

- Advertisement -
- Advertisement -

బాల్కొండ : మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పలుఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం మండల కేంద్రంలో 50లక్షల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండపానికి, నూతనంగా నిర్మించిన కెజిబివి స్కూల్ ప్రారంభోత్సవం (వన్నెల్(బి), కిసాన్‌నగర్ గ్రామంలో బాల్కొండ నుంచి ముప్కాల్ వరకు 1.3కోట్ల వ్యయంతో బిటి రోడ్డు పునరుద్దరణ, నాగాపూర్ నుంచి గోదావరి రివర్ వరకు 1.15 కోట్ల వ్యయంతో బిటి రోడ్ ఫార్మేషన్ రోడ్‌కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్కొండ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. సిఎం కెసిఆర్ సహకారంతో 114 కోట్లతో బాల్కొండ గ్రామంఅన్నివిధాలా అభివృద్ధి చేయడం జరిగిందని గణాంకాలతో సహా మంత్రి వివరించారు. తాను అభివృద్ధికోసం తాపత్రయపడుతుంటే బిజెపి, కాంగ్రెస్ నేతలు కమిషన్లు తింటున్నానని అసత్య ఆరోపనలు చేస్తున్నారని మండిపడ్డారు. తనతమ్ముడు గంజాయి అమ్ముతున్నారని అడ్డగోలుగానిరాధార ఆరోపనలు చేస్తున్నారని, గంజాయి అమ్మవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

ఇలాంటి మాటలు తనను బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బాల్కొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా గంజాయి కేసులు అయ్యాయని తాను ఆదిలాబాద్ ఎస్పీ, జిల్లా పోలీసు వారినిపలుమార్లు ఆదేశించగా, కఠినంగా వ్యవహరిస్తే గంజాయి వాడకం తగ్గిందని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న ఏకైక క్రషర్‌లో 400 కోట్లు సంపాదించారని ఆరోపిస్తున్నారి, తాను తన బంధువులకు చెప్పి 10 కోట్లకే ఆ క్రషర్ ఇప్పిస్తానని ఆరోపనలు నిరూపించాలని సవాల్ చేశారు. ఇంకా నియోజకవర్గంలో 300నుంచి 400 కోట్ల పనులు చేపట్టవలసి ఉందని, అందులో 100 నుంచి 150 కోట్లు బిజెపినేతలు చెప్పిన వారికే ఇస్తా కాంట్రాక్టుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టులన్నీ మీకే అప్పగిస్తా దమ్ముంటే ముందుకు రావాలని మంత్రి సవాల్ చేశారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఉప్పు, పప్పు, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యులను గోసపెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News