- Advertisement -
న్యూస్ డెస్క్: చిరుతలు, మహిళలు, గిరిజనులు&మధ్యప్రదేశ్‌లో ఎవరూ సురక్షితంగా లేరు అంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు కమల్ నాథ్ వ్యాఖ్యానించారు.
బుధవారం బోపాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి చోట కల్లోలంగా ఉందని అన్నారు. చిరుత పులులు కాని మహిళలు కాని గిజరనులే కాని వరికీ ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటూ ఆయన అన్నారు. కాంట్రాక్టర్లు, అవినీతిపరులు మాత్రమే ఇక్కడ సురక్షితంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కునో జాతీయ పార్కులో ఇటీవల ఒక చిరుత మరనించిన సంఘటన గురించి ప్రశ్నించినపుడు ఆయన ఈ విధంగా స్పందించారు.
చిరుతల విషయమే తీసుకున్నా గిరిజనుల విషయమే తీసుకున్నా ఎవరికి ఈ రాష్ట్రంలో రక్షణ ఉంది అని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌ను ఎక్కడకు తీసుకువెళుతున్నారో తలచుకుంటే విచారం కలుగుతోందని కమల్ నాథ్ చెప్పారు.
- Advertisement -