Monday, December 23, 2024

హిందూత్వపై మాకే పాఠాలు చెబుతారా…

- Advertisement -
- Advertisement -

no one should teach Hindutva to Shiv Sena

శివసేన ఎంపి సంంజయ్ దౌత్ వ్యాఖ్య

ముంబయి: మహారాష్ట్రలో లౌడ్‌స్పీకర్ మార్గదర్శకాల ఉల్లంఘనలేవీ జరగలేదని, శివసేనకు హిందూత్వ గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని శివసేన ఎంపి సంజయ్ రౌత్ బుధవారం స్పష్టం చేశారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సూడో హిందూత్వవాదులతో కుమ్మక్కై శివసేనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నవారి గురించి ప్రజలు పట్టించుకోవలసిన అవసరం లేదని పరోక్షంగా రాజ్‌థాక్రే సారథ్యంలోని ఎంఎన్‌ఎస్‌పై వ్యాఖ్యానించారు. మసీదులపై ఉన్న లౌడ్‌స్పీకర్లను తొలగించకపోతే ఆందోళన చేస్తామంటూ రాజ్‌థాక్రే చేసిన హెచ్చరికపై ఆయన స్పందిస్తూ లౌడ్‌స్పీకర్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారిని అదుపుచేసే సామర్ధం తమకు ఉందని ఆయన చెప్పారు. ముంబయిలో కాని మహారాష్ట్రలో కాని లౌడ్‌స్పీకర్లపై ఆందోళన చేసేంత పరిస్థితి లేదని, లౌడ్‌స్పీకర్లను ఉపయోగించుకునేందుకు అన్ని మసీదులు అనుమతి తీసుకున్నాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News