Tuesday, September 17, 2024

నా రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యమే: ముత్తయ్య మురళీధరన్‌

- Advertisement -
- Advertisement -

కొలంబో: ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ది ప్రత్యేక స్థానం. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అసాధారణ రికార్డు మురళీధరన్ సొంతం. సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ఏకంగా 800 వికెట్లను పడగొట్టి మురళీధరన్ నయా చరిత్ర సృష్టించాడు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ లో అతను తన రికార్డు గురించి ప్రస్తావించాడు. టెస్టుల్లో తాను సాధించిన అత్యధిక వికెట్ల రికార్డు ఎప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచిపోవడం ఖాయమని జో స్యం చెప్పాడు. తన రికార్డును ఎవరూ కూడా బద్దలు కొట్టలేరని పేర్కొన్నాడు.

ప్రస్తుత రోజుల్లో క్రికెట ర్లు ఎక్కువగా పొట్టి క్రికెట్‌పైనే ఆసక్తి చూపుతున్నారని, ఇలాంటి స్థితిలో టెస్టుల్లో తాను నెలకొల్పిన రికార్డును అందుకోవడం ఈ తరం బౌలర్లకు చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నాడు. పొట్టి ఫార్మాట్ రాకతో టెస్టు క్రికెట్ భ విష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశాడు. నేటి తరం క్రికెటర్లు టెస్టులపై ఆసక్తి చూపడం లేదని, జోరుమీదున్న సమయంలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారని, ఇది బాధించే అంశమన్నాడు. టెస్టులను రక్షించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తగు చర్యలు తీసుకోవాలని మురళీధరన్ సూచించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News