Monday, December 23, 2024

పంచాయతీలకు ఒక్క రూపాయి పెండింగ్‌ లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి పెండింగ్‌లో లేదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రతి నెలా టంచనుగా స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.256 కోట్ల నిధులను అందిస్తుందన్నారు. ఇప్పటిదాకా సుమారు రూ. 10 వేల కోట్లను గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వనిదేనని కెటిఆర్ అన్నారు. స్థానిక సంస్థలకు ఇంత పెద్దమొత్తంలో నిధులు ఇచ్చి బలోపేతం చేస్తుంటే కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తానికి కేంద్రం నుంచి రెండు నెలలుగా రావాల్సిన నిధులు రూ.1400 కోట్ల రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా… కొత్త సాఫ్ట్‌వేర్ పేరుతో అనేక ఇబ్బందులు పెడుతుందోని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ప్రజల ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు.
గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణపై ఎంపీలు, ఎంఎల్‌సిలు, శాసనసభ్యులు, జెడ్‌పి చైర్మన్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో నినదించాలని పిలుపునిచ్చారు. ఈ నిధులపై ప్రతిపక్షాలతో పాటు కొన్ని పత్రికలు సైతం అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కామారెడ్డి సదాశివనగర్ సర్పంచ్‌కు సంబంధించిన విషయంలో నిధులు వచ్చినప్పటికీ డబ్బులు రాలేదని అసత్య ప్రచారాలు చేశాయని కెటిఆర్ మండిపడ్డారు. ఇలా కొంతమంది… కొన్ని పార్టీలు… పత్రికలు కలిసి సోషల్ మీడియాలో కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. సిఎం కెసిఆర్ విజన్, నిబద్ధత కారణంగానే నేడు పట్టణాలు పల్లెలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయని కెటిఆర్ అన్నారు.
స్థానిక సంస్థల కోసం ప్రత్యేకంగా ఒక అడిషనల్ కలెక్టర్ నియమించి ప్రత్యేక ఎజెండాతో ముందుకు పోతున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్సేనని కెటిఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పల్లె, పట్టణ ప్రగతి లక్ష్యాలను అందుకుంటూ దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం అవార్డు అందుకుంటున్న విషయాన్ని ప్రజలకు వరించాలని సూచించారు. ఏనిమిదేళ్ల తెలంగాణ అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. సిఎం ప్రత్యేక చొరవ వలన గ్రామాల్లో అద్భుతమైన మార్పు, అభివృద్ధి సాధ్యమైందన్నారు. ప్రభుత్వ నిర్మాణాత్మకమైన కార్యక్రమాల వలన నేడు గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తున్నదన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేసి పల్లె ప్రగతి ద్వారా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల వల్లే గ్రామాల్లో ప్రస్తుతం వైకుంఠ దాకా, నర్సరీలు, పార్కులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయన్నారు. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పెండింగ్ బకాయిల పైన కేంద్రం పైన దండెత్తాలని కెటిఆర్ సూచించారు. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడుగా ఉండి కేంద్ర ప్రభుత్వం యొక్క ఉపాధి హామీ పథకంపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

No Pending bills to Panchayats in Telangana: KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News