Thursday, December 12, 2024

బెన్‌ఫిట్ షోలకు అనుమతి నో

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఇలాంటి షోలతో
శాంతి భద్రతలకు విఘాతం
మంత్రి కోమటిరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు వేసేందుకు అనుమతులు ఇవ్వబోమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసి క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద విషాదం చోటుచేసుకోగా, ఆ సమయంలో జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. శుక్రవారం విలేకరులతో ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నగరం నడిబొడ్డున బెనిఫిట్ షో కుటుంబంతో సరదాగా సిని మా చూసేందుకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతగానో బాధించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హామినిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News