Wednesday, January 22, 2025

ఓయూలో రాహుల్ గాంధీ సభకు నో పర్మిషన్

- Advertisement -
- Advertisement -

No permission for Rahul Gandhi Sabha in OU

హైదరాబాద్:  కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ సభకే కాదు.. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని కౌన్సిల్ నిర్ణయించింది. దీనితోపాటు క్యాంపస్‌లోకి కెమెరాలను నిషేధించింది. మే 7న ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్ కాలేజీ వద్ద రాహుల్‌గాంధీ.. విద్యార్థులతో మమేకం అవుతారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ సభకు అనుమతి నిరాకరిస్తూ ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News