Monday, January 20, 2025

కొత్త ఆటోలకు అనుమతులు లేవు

- Advertisement -
- Advertisement -

మీడియా చిట్‌చాట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్

మనతెలంగాణ/హైదరాబాద్ : విఐపిల (మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఐపిఎస్‌లు, ఐఏఎస్‌ల) దగ్గర పని చేసే డ్రైవర్లకు ఫిట్‌నెస్ టె స్టులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిని రవాణాశాఖ స్వయంగా సుమోటోగా తీసుకుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియను మూడు, నాలుగు రోజుల్లో ప్రారంభిస్తామని దీనికి సంబంధించి డిజిపితో పాటు అందరికీ లేఖ రాస్తున్నామని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ లాస్య నందిత ప్రమాద ఘటనను దృష్టిలో ఉంచుకొని విఐపిల డ్రైవర్ల అందరికీ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఈ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ప్రతిభ లేని డ్రైవర్లను ఎవరిని కూడా విధుల్లో ఉంచుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గాంధీభవన్‌లో మంత్రి పొన్నం మీడియాతో చిట్‌చాట్ చేశారు.
ప్రస్తుతం 55 లక్షల మంది ప్రయాణం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మీ పథకం వ్యయాన్ని రీఫండ్ చేయడం, వృథా ఖర్చులు తగ్గించడం, ఆక్యుపెన్షీ పెరగడం వల్ల ఆ ర్టీసి లాభాల్లోకి వచ్చినట్లు మంత్రి వివరించారు. గతంలో ఆర్టీసి బస్సుల్లో రెగ్యులర్‌గా 44లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తే ప్రస్తుతం అది 55లక్షలకు పెరిగిందని ఆయన తెలిపారు. మహాలక్ష్మీ పథకంలో కండక్టర్లు అనవసరంగా టికెట్లు జారీ చేసినట్లు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసికి చెల్లించే అద్దె విషయంలో ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేయగా అందులో కొం దరు అద్దెలు చెల్లించగా మరికొందరు సగం చెల్లించారని పెం డింగ్ బకాయిలపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. కండక్టర్, డ్రైవర్లపై వచ్చే ఫిర్యాదులపై ఆర్టీసి ఆదాలత్ పెడతామని, బస్సు ల కనెక్టివిటి పెంచుతామని ఆయన తెలిపారు.
కొత్త ఆటోలకు అనుమతులిస్తే ఇబ్బందులు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లను ఆ దుకునేందుకు కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే అర్హత కలిగిన డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు అందిస్తామని ఆయన తెలిపారు. గ్రేటర్ పరిధిలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఆటోలు ఉన్నాయని, వాటిపై స్క్రూటీని ని ర్వహించిన తరువాతే ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. నగరంలో కొత్త ఆటోల కు అనుమతులిస్తే ప్రస్తుతం ఉన్న డ్రైవర్లకు ఇబ్బం ది ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. గ్రేటర్ పరిధిలో కొత్త ఆటోలకు అనుమతి లేకపోవడం వల్ల జిల్లాల నుంచి కొనుగోలు చేసిన ఆటోలను ఇక్కడ నడుపుతున్నారని దీనివల్ల ఆటోలు కూడా పెరిగాయని ఈ విషయంలోనూ తాము ఒక నిర్ణ యం తీసుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం అమ లు తరువాత కూడా ఆటో కొనుగోలు పెరిగాయని మంత్రి పొన్నం తెలిపారు. ఆటోలు 2023 డిసెంబర్ నుంచి 2024 వరకు కొత్తగా గతంలో కంటే ఎక్కువ కొన్నారని ఆయన తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోలకు నష్టం ఉంటే, కొత్త ఆటోలను ఎందుకు కొంటారని పొన్నం ప్రశ్నించారు.
త్వరలోనే కులగణనను ప్రారంభిస్తాం
త్వరలోనే కులగణనను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దీనికి నోడల్ ఆఫీసర్‌గా బిసి వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఉంటుందని పొన్నం వెల్లడించారు. కులగణనపై అధికారులకు శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. గతంలో బీహార్‌లో చేసిన విధానంపై అధ్యయనం చేశామని, అక్కడ రెండున్నర లక్షల మందికి కులగణన సర్వే బాధ్యతను బీహార్ ప్రభు త్వం అప్పగించిందని, అదే తరహాలో ఇక్కడ కూ డా దీనిని ప్రవేశ పెట్టే విషయమై పరిశీలన చేస్తున్నట్లు ఆయన వివరించారు. బీహార్‌లో కూడా కులగణన కోసం అసెంబ్లీలో చట్టం తీసుకురాలేదని పొన్నం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News