Monday, December 23, 2024

ఐటీ రిటర్నులకు తుడి గడువు జూలై 31

- Advertisement -
- Advertisement -
Tarun Bajaj
ఆర్థిక సంవత్సరం 2021-22కి సంబంధించి జూలై 20 నాటికి 2.3 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని, వాటి సంఖ్య పెరుగుతోందని తరుణ్ బజాజ్ చెప్పారు.
గడువు పెంచేది లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలుకు గడువు పెంచే యోచనేదీ లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ స్పష్టం చేశారు. జూలై 31 ఆఖరు తేదీ అని, చాలా మటుకు రిటర్నులు తుది గడువులోగానే వస్తాయని అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను జూలై 20 వరకూ 2.3 కోట్ల పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని, ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని బజాజ్‌ వివరించారు. కోవిడ్‌ పరిణామాలు, ఐటీ పోర్టల్‌లో సమస్యలు తదితర అంశాల కారణంగా గతేడాది డిసెంబర్‌ 31 వరకూ గడువు పెంచిన సంగతి తెలిసిందే. ఈసారీ అలాగే జరుగుతుందనే ఉద్దేశంతో కొందరు నెమ్మదిగా ఐటీఆర్‌లు దాఖలు చేయొచ్చులే అని భావిస్తుండవచ్చని బజాజ్‌ పేర్కొన్నారు. కానీ ఈసారి గడువును పొడిగించే యోచనేదీ లేదన్నారు. ప్రస్తుతం రోజువారీ 15–18 లక్షల రిటర్నులు వస్తుండగా,  రాబోయే రోజుల్లో 25 లక్షల నుంచి 30 లక్షల వరకూ పెరగవచ్చని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News