Wednesday, January 22, 2025

జెలెన్స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన లేదు: రష్యా

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఉక్రెయిన్‌లో జెలెన్స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన ఏదీ లేదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా బుధవారం తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన మూడో రౌండ్ చర్చల్లో కొంత పురోగతి జరిగిందన్నారు. అమెరికా అండతో ఉక్రెయిన్‌లో జీవాయుధాలు రూపొందించే డాక్యుమెంటల్ సాక్షం రష్యా వద్ద ఉందని కూడా ఆమె అన్నారు. మరియా జఖరోవా ఒక ప్రశ్నకు సమాధానంగా, అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ విక్టోరియా సులాండ్ జీవశాస్త్ర పరిశోధన కోసం ప్రయోగశాలల ఉనికిని ధృవీకరించారని తెలిపారు. ‘మేము అమెరికా నుంచి జీవాయుధాల ప్రయోగం వివరాలు డిమాండ్ చేస్తున్నాము. ప్రపంచం కూడా ఎదురుచూస్తోంది’ అని ఆమె తెలిపారు. ఇదిలావుండగా జీవాయుధాల ప్రయోగం గురించిన ఆరోపణలను పెంటగాన్, ఉక్రెయిన్ ఇప్పటికే ఖండించాయి. ‘కీవ్ అధికారులు కావాలనే తరలింపు ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని, కావాలనే ప్రజలకు మానవ నడవల గురించి చెప్పడంలేదని, రష్యాకు వెళ్లాలనుకుంటున్న వారిని సైతం పశ్చిమ ఉక్రెయిన్ దిశకే మళ్లిస్తున్నారు’ అని ఆమె వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News