Monday, January 20, 2025

జహీరాబాద్ ఎంపిగా పోటీ చేసే ఆలోచన లేదు: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:   తనను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని తమ పార్టీ చెబుతోందని కానీ తనకు ఆసక్తిలేదని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకూ తమ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలో బండి సంజయ్ కోసం తాను ప్రచారం చేస్తానన్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్‌లో కూడా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

తాను హిందూరాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలని భావిస్తున్నానన్నారు. తనకు శాసనసభా పక్షనేత పదవిపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. పార్టీ నుంచి గెలిచిన 8 మందిలో ఒకరిని ఫ్లోర్ లీడర్‌గా చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం మంచిది కాదన్నారు. బిసి సిఎం నినాదంతో ఎన్నికలకు వెళ్ళామని అందుకే బిసి ఎమ్మెల్యేను ఫ్లోర్ లీడర్‌గా నియమించాలని బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News