Thursday, January 23, 2025

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సింగరేణి బొగ్గు గనుల సంస్థను ప్రైవేటీకరించే ఆలోచనేదీ కేంద్రప్రభుత్వానికి లేదని పార్లమెంటు వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. బుధవారం నాడు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమాధానమిస్తూ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఈ నెల 24న పార్లమెంటు వేదికగా ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మౌఖికంగా సమాధానం ఇచ్చారు.

గనులను వేలం వేయడం నిరంతర ప్రక్రియని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం, కేంద్రప్రభుత్వ వాటా 49 శాతం ఉండగా కేంద్రం సింగరేణిని ఎలా ప్రైవేటీకరిస్తుందని అన్నారు. గనుల కేటాయింపులో పారదర్శకత ఉండేందుకే వేలం ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. ఇందులో ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొంటాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News