Sunday, December 22, 2024

ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదు: స్టీవ్ స్మిత్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: తాను టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఖండించాడు. ఇప్పట్లో తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఇప్పట్లో తన కెరీర్ ముగించాలని భావించడం లేదన్నాడు. మరి కొన్నేళ్లపాటు క్రికెట్‌లో కొనసాగుతానని వివరించాడు. తాను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నాడు.

టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్‌లలో ఆడేందకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే సిడ్నీ సిక్సర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు స్మిత్ వెల్లడించాడు. బిగ్ బాష్‌లో ఆడడం ద్వారా మళ్లీ టి20 టీమ్‌లో చోటు సంపాదించడమే లక్షంగా పెట్టుకున్నట్టు వివరించాడు. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే సత్తా తనకు ఉందని స్మిత్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News