మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ ఎంట్రీ లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఆదివారం నాడు ఖమ్మంలో తమ బంధువుల ఇంటికి ఆయన వచ్చారు. ఖమ్మం రావడానికి ముందు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎపి సిఎం జగన్ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ పై కూడా వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆయన ఖమ్మంకు వచ్చారు. ఖమ్మంలో జరిగిన తమ బంధువుల ఇంటికి వచ్చారు. వివాహా కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆయన వెళ్లిపోయారు. ఈ సమయంలో మీడియా ఆయనతో మాట్లాడిం చేందుకు ప్రయత్నిస్తే తాను బంధువుల ఇంటికి వచ్చినట్టుగా చెప్పారు. రాజకీయ రంగ ప్రవేశం లేదన్నారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. బిజెపి కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకొన్నాడు. సాయి గణేష్ ఆత్మహత్యాయత్నం చేసుకొన్న తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మీడియాతో మాట్లాడారు.
తనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు పాల్పడ్డాడన్నారు. ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడని ఆయన చెప్పారు. ఈ విషయమై ఈ నెల 22న పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. కమ్మ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న ఘటనను పెద్దదిగా చేస్తున్నారన్నారు.తనపై కొందరు కుట్ర చేస్తున్నారని అజయ్ కుమార్ ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి తాను ఒక్కడినేని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత లగడపాటి రాజగోపాల్ ఖమ్మంకి రావడం ప్రాధాన్యత సంతరించుకొంది. బంధువుల ఇంటికి వివాహనికి హాజరైనట్టుగా చెబుతున్నప్పటికీ రాజకీయ వ్యవహరాలపై చర్చలు జరిపారనే ప్రచారం కూడా లేకపోలేదు.
అయితే ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు లగడపాటి రాజగోపాల్ నిరాకరించారు. బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యాయన్నారు. రాజకీయాల్లో ఎంట్రీ లేదని ముక్తసరిగా చెప్పాడు. గత వారంలోనే కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన కమ్మ సామాజిక వర్గం సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రసంగించారు. అమరావతిని కమ్మరావతికి పెట్టాలని ఎపి సిఎం జగన్ కి సవాల్ విసిరారు. కమ్మ సామాజిక వర్గాన్ని హేళన చేస్తున్నారన్నారు. అయితే సాయి గణేష్ ఆత్మహత్య ఘటనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మీడియా సమావేశాల్లో రేణుకా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు.