Wednesday, January 22, 2025

రైల్వే పరిశ్రమలపై రాజకీయాలు వద్దు

- Advertisement -
- Advertisement -

కాజీపేట: రైల్వే పరిశ్రమలను రాజకీయాలకు వాడుకోవద్దని తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జెఏసి కన్వీనర్ దేవుల్లపల్లి రాఘవేందర్ పెర్కొన్నారు. మంగళవారం కాజీపేట రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ అవరణలో ఏర్పాటు చేసిన విలెకరుల సమావేశంలో తెలంగాణ రైల్వే ఏంప్లాయిస్ జెఏసి కన్వీనర్ దేవుల్లపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ కాజీపేట మండలంలోని అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న రైల్వే పరి శ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు రావని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టాలని ఆయన అన్నారు.

గతంలో మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌లు ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసారని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైల్వే పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడానికే మొగ్గు చూపుతుందని, రాష్ట్రంలో మరో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అనుమానమేనని ఆయన అన్నారు, రైల్వే పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగులు పెరుగుతారని దింతో డివిజన్ ఏర్పడుతుందని ఆయన అన్నారు.

రైల్వే వ్యాగెన్ వర్క్ షాప్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడి ప్రకటన చేస్తారని ఆశాభవం వ్యక్తం చేసారు. లేదంటే కాజీపేట రైల్వే డివిజన్ పై రాబోయె రోజుల్లో రైల్వే జెఏసి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలతో రౌండ్ టెబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని కాజీపేట రైల్వే డివిజన్ సాదించుకునేందుకు అందరం కలిసి పోరాడుదామని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కొండ్ర నర్సింగరావు, వేధ ప్రకాశ్, అనుమల శ్రీనివాస్ , కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News