త్వరలో వైదొలగనున్నారన్న వార్తల నేపథ్యంలో..
హవేరీ: కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై తన సొంత నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా వేదాంతధోరణిలో మాట్లాడారు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ జీవితం కూడా. ఈ పదవులు కూడా శాశ్వతం కాదు. ఈ విషయం తాను ప్రతిపక్షణం గుర్తుంచుకుంటానని బొమ్మై అన్నారు. తన నియోజకవర్గ ప్రజలు తనను ముఖ్యమంత్రిగా కాకుండా బసవరాజ్‌గానే గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. తాను తన నియోజకవర్గానికి వెళ్లినపుడెల్లా జొన్న రొట్టెలు, జొన్నన్నం ఎంతో ఆప్యాయంగా తింటానని బొమ్మై తెలిపారు. బెలగావిజిల్లా శిగ్గావ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బొమ్మై కిట్టూర్‌రాణి చెన్నమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాణీ చెన్నమ్మ 19వ శతాబ్దానికి చెందిన కిట్టూర్ రాణి. బ్రిటీష్ పాలనకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర చెన్నమ్మకున్నది. మోకాలి సమస్యతో బొమ్మై బాధపడుతున్నట్టుగా చెబుతున్నారు. విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే, అధికారికంగా దీనిపై ఇంకా ప్రకటన రాలేదు.