న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో(యుటిల్లో) కొవిడ్19 వ్యాక్సినేషన్ కోసం ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేదు. 13 రాష్ట్రాలు, యుటిల్లో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలు పదికన్నా తక్కువ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ కొవిన్ పోర్టల్ ద్వారా తెలుస్తోంది. వీటిలో ఐదింటిలో ఒక్క ప్రైవేట్ హాస్పిటల్‌లోనూ సదుపాయం లేదు. పదికన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలు, యుటిలు..మేఘాలయ(7),పుదుచ్చేరి(7), నాగాల్యాండ్ (4), మణిపూర్ (3), దాద్రానగర్‌హవేలీ (2), మిజోరం(2), త్రిపుర (1), సిక్కిం ( 1), అండమాన్‌నికోబార్ (0), దమన్‌దీవులు (0), లడఖ్ (0), లక్షద్వీప్ (0),అరుణాచల్‌ప్రదేశ్ (0). ఆసక్తికరంగా తమిళనాడులోని 1118 ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సదుపాయాలున్నాయి. మే 1నుంచి మూడో దశలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించవచ్చునని రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.