Saturday, November 23, 2024

పార్‌బాయిల్డ్ రైస్ తీసుకోం: కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్‌బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. అంతేకాక యాసంగి పంట కూడా పరిమితంగానే కొంటామని పేర్కొంది. ఇక రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయిస్తామని వెల్లడించింది. “ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్ ఒక్కో విధంగా ఉంటుంది. డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం పార్‌బాయిల్డ్ రైస్‌ను కేంద్రం కొనబోదు. వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని రాష్ట్రాలను కోరుతున్నాం. ప్రస్తుతం దేశంలో సరిపడేంత నిల్వలు ఉన్నాయి. ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ పంటలవైపుకు వెళ్లాలని సూచనలు చేస్తున్నాం. నూనె గింజలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నాం” అని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. గమనించాల్సిన విషయమేమిటంటే తెలంగాణలో రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ మహాధర్నా చేస్తున్న రోజే కేంద్రప్రభుత్వం ఇలా తెలుపడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News