Tuesday, November 5, 2024

పిల్లలకు నో ఫికర్

- Advertisement -
- Advertisement -

No proof Children affected worse in Corona 3rd Wave

మూడో దశలో చిన్నారులపై ప్రభావం చూపుతుందనడానికి శాస్త్రీయ ఆధారాల్లేవు ఎయిమ్స్

– డబ్లుహెచ్‌ఒ ఉమ్మడి సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా మొదటి, రెండు వేవ్‌ల కన్నా భవిష్య కరోనా వేవ్ వల్ల పిల్లలపై విచక్షణా రహితంగా అత్యధిక ప్రమాదం ఉంటుందని చెప్పడానికి సరైన దాఖలాలేవీ కనిపించలేదని ఎయిమ్స్‌ప్రపంచ ఆరోగ్యసంస్థ ఉమ్మడిగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఢిల్లీ, భువనేశ్వర్, గోరఖ్‌పూర్ ఎయిమ్స్‌లతోపా టు పుదుచ్చేరికి చెందిన జిప్‌మెర్, ఫరీదాబా ద్ హెల్త్ సైన్సెస్, అగర్తలా ప్రభుత్వ వైద్య క ళాశాల సంస్థలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదివరకటి కన్నా పిల్లలకు భవిష్య కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందన్న వాదాన్ని కొట్టిపారేసింది. ఈ అధ్యయనంలో 4509 మంది నుంచి రక్తనమూనాలు తీసుకున్నారు. వీరిలో 700 మంది 2 నుంచి 17 ఏళ్ల లోపు వారు కాగా, 3809 మంది 18 ఏళ్లు పైబడినవారు. సార్క్ కోవిడ్ 2 కు వ్యతిరేకంగా వీరిలో యాంటీబాడీలు ఎంతవరకు వృద్ధి చెందుతాయో మార్చి 15 నుంచి జూన్ 10 వరకు ఆ నమూనాలను తనిఖీ చేశారు.

ఢిల్లీ, ఫరీదాబాద్, భువనేశ్వర్, అగర్తలా, గోరఖ్‌పూర్ నుంచి అధ్యయనంలో పాల్గొన్న వారిలో 55.7శాతం పిల్లలు, యువతలో వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు పెరగడాన్ని గమనించారు. వీరి కన్నా పెద్దల్లో సీరోప్రెవలెన్స్ అంటే వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తి 63.5 శాతం వరకు వృద్ది చెందినట్టు సర్వేలో వెల్లడైంది. ఈ ఆధారాల బట్టి భవిష్యత్‌లో ఎటువంటి కరోనా వేవ్ ఎదురైనా పిల్లలు, పెద్దలు అందరిలో వ్యాధి నిరోధక శక్తి ఒకేలా ప్రభావం చూపిస్తుందని స్పష్టమైంది. పిల్లలకు ఎక్కుప ప్రమాదం ఉన్నదనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఢిల్లీ ఎయిమ్స్ ప్రతినిధి వెల్లడించారు.

No proof Children affected worse in Corona 3rd Wave

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News