Wednesday, January 22, 2025

ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు యోచన లేదు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

No Proposal for set up 8th Pay Commission: Centre

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఒకవేళ ఈమేరకు సకాలంలో రాజ్యాంగ నిర్ధారణ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే అది 2026 జనవరి 1 నుంచి అమలు లోకి వస్తుందని వివరించారు. ద్రవ్యోల్బణం కారణంగా వారి జీతాల వాస్తవ విలువలో కోత ఉంటే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కరవు భత్యం (డిఎ) చెల్లించడమౌతుందని పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి ద్రవ్యోల్బణం ఆధారంగా డిఎను సవరించడమౌతుందని చెప్పారు. 2014ఫిబ్రవరిలో ప్రభుత్వం ఏడవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీని సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమలు లోకి వచ్చాయి.

No Proposal for set up 8th Pay Commission: Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News