Monday, December 23, 2024

గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై నిషేధం యథాతథం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గోధుమలు, బియ్యం,పంచదార ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గోధుమలు, పంచదారను భారత్ దిగుమతి చేసుకోబోదని శనివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి తెలిపారు.‘ గోధుమలు, బియ్యం, పంచదార ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలన్న ప్రతిపాదన ఇప్పటికైతే ప్రభుత్వం వద్ద లేదు. గోధుమలు, పంచదారను భారత్ దిగుమతి చేసుకోదు’ అని పీయూష్ తెలిపారు.

గోయల్ దేశీయ మార్కెట్లో ధరలను అదుపు చేయడానికి గత ఏడాది అక్టోబర్‌నుంచి పంచదార ఎగుమతులపై నిషేధం విధించింది. అంతకుముందే జులైనుంచి బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది. 2022 మేనుంచి గోధుమల ఎగుమతిపై నిషేధం అమలులోకి తెచ్చింది. త్వరలో పలు రాష్ట్రాలతో పాటుగా పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో ధరలను నియంతించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News