- Advertisement -
హైదరాబాద్: దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతోందని సిఎల్ పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గాంధీ భవన్ లో భట్టి మీడియాతో మాట్లాడారు. ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తుండడంతో ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తుల భద్రతా సమస్యకు ఫోన్ కాల్స్ ట్యాప్ తెరలేపాయని, ఫోన్ ట్యాప్ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ లో ఫోన్ ట్యాపింగ్ సమస్య ఆందోళన కలిగిస్తోందని, ట్యాపింగ్ చేసే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వస్తి చెప్పాలన్నారు. 22వ తేదీన చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
- Advertisement -